‘నవీముంబై’ రేసులో ఐదుగురు | Navimumbai corporation election for mayor five candidates in competition | Sakshi
Sakshi News home page

‘నవీముంబై’ రేసులో ఐదుగురు

Apr 29 2015 3:38 AM | Updated on Sep 3 2017 1:02 AM

నవీముంబై కార్పొరేషన్ మేయర్ పదవికి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు...

- రేసులో ముందున్న సుధాకర్ సోనవణే
- ఎస్సీకి రిజర్వు అయినమేయర్ పీఠం
సాక్షి, ముంబై:
నవీముంబై కార్పొరేషన్ మేయర్ పదవికి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మేయర్ పదవికి ఎన్సీపీ నేత గణేశ్ నాయక్ అననూయుడు సుధాకర్ సోనవణే, రంజనా సోనవణే డిప్యూటీ పదవికి కాంగ్రెస్ నేత అవినాశ్ లాడ్ పేర్లు వినిపిస్తున్నాయి. మేయర్ పదవి ఎస్సీకి రిజర్వు చేశారు. సోమవారం జరిగిన ఇరుపార్టీల సమావేశంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎన్సీపీ అభ్యర్థి ఐదేళ్లు మేయర్‌గా కొనసాగుతారు. కాంగ్రెస్ కార్పొరేటర్లలో ఇద్దరు రెండున్నర ఏళ్ల చొప్పున డిప్యూటీ మేయర్ పద విలో ఉంటారని తీర్మానించారు.

సుధాకర్ సోనవణే, రంజనా సోనవణే, రమేశ్ డోలే, సరేఖా నర్బాగే, ముద్రికా గావ్లీ, తనూజా మడ్వీ, నివృత్తి జగ్తాప్ మేయర్ పదవి రేసులో ఉన్నారు. వీరిలో సుధాకర్ సోనవణేకు గణేశ్ మద్దతుతో పాటు కార్పొరేషన్ పరిధిలో అన్ని వర్గాలతో మంచి సంబంధాలున్నాయి. సభాగృహం నడిపించే సత్తా ఉండటంతో ఆయన పేరు అగ్రస్థానంలో ఉన్న ట్లు తెలిసింది. ఇక డిప్యూటీ కోసం కాంగ్రెస్ తరఫున రమాకాంత్ మాత్రే భార్య మందాకిని మాత్రే, అవినాశ్ లాడ్ రేసులో ఉన్నారు. సీని యార్టీ ప్రకారం లాడ్‌కు ప్రధాన్యం లభించనుంది. మే 5 లేదా 6న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత స్పీ కర్ అనంత్ ఓడటంతో జయవంత్ సుతార్‌ను నియమించే సూచనలు ఉన్నాయి.

291 మంది డిపాజిట్లు గల్లంతు
నవీముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 568 మంది అభ్యర్థులు బరిలో దిగారు. అందులో 291 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాంగ్రెస్ 66 మంది అభ్యర్థులు ఉండగా ఎన్సీపీ-4, బీజేపీ-7, శివసేన-2 ఇతరులు, ఇండిపెండెంట్లు 212 మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement