నళిని నిరాహార దీక్ష! | Sakshi
Sakshi News home page

నళిని నిరాహార దీక్ష!

Published Sat, Jul 19 2014 9:58 AM

Nalini strike in Tamil Nadu Jail

దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ను చూసేందుకు కోర్టు అనుమతించక పోవడంతో మహిళా జైలులో నళిని ఆహారం తినకుండా నిరాహారదీక్షకు దిగింది. మురుగన్ పురుషుల జైలులో, భార్య నళిని మహిళా జైలులో శిక్ష అనుభవిస్తు న్న విషయం తెల్సిందే. వీరు ప్రతి 15 రోజు లకు ఒకసారి మాట్లాడేందుకు గతంలో కోర్టు అనుమతించింది. అయితే కొద్ది రోజుల క్రితం మురుగన్ నుంచి సెల్‌ఫోన్, నగదును పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు.
 
 ఈ నేపథ్యం లో ఈ నెల 12న నళిని, మురుగన్‌లు కలుసుకోవాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతించలేదు. నిబంధనలకు విరుద్దంగా మురుగన్ జైలులో నగదు పెట్టుకున్నాడన్న నెపంతో రెండు నెలలు నళిని చూడకుండా నిషేధం విధించారు. విషయం తెలుసుకున్న నళిని జైలులో మౌన పోరాటం చేసోంది. మహిళా జైలులోని అధికారులు చర్చలు జరిపారు. ఆ సమయంలో తనకు ఆహారం వద్దని భర్తను చూడకుండా ఉండలేక పోతున్నానని నళిని కన్నీరు పెట్టుకున్నట్లు జైలు అధికారులు  తెలిపారు. గురువారం పూర్తిగా ఆహారం తీసుకోలేదు. చర్చల అనంతరం శుక్రవారం ఉద యం ఆమె ఆహారం తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement