
తమిళంలోకి నగరం నిద్రపోతున్న వేళ
తెలుగు చిత్రం నగరం నిద్రపోతున్న వేళ ఇప్పుడు తమిళంలో రాబోతుంది. లింగా చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను
తెలుగు చిత్రం నగరం నిద్రపోతున్న వేళ ఇప్పుడు తమిళంలో రాబోతుంది. లింగా చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఢీకొన్న టాలీవుడ్ నటుడు జగపతిబాబు హీరోగా నటించిన చిత్రం నగరం నిద్రపోతున్న వేళ. చార్మి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ప్రేమ్‌రాజ్ దర్శకత్వం వహించారు. యశోదకృష్ణ సంగీతాన్ని, లక్ష్మీ నరసింహన్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రంలో సత్యప్రకాష్, గాంధి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమిళంలో రమణ ఫిలింస్ అధినేతలు వి.రమణ, ఖాన్ పర్తీన్‌ఖాన్ తమిళంలోకి తలైప్పు సెయ్‌ది పేరుతో అనువదిస్తున్నారు.
చిత్ర వివరాలను నిర్మాతలు తెలుపుతూ ఇది పూర్తి యాక్షన్ కథా చిత్రం అన్నారు. టీవీ రంగంలో నెలకొన్న పోటీ కారణంగా నంబర్‌వన్ స్థానంలో రాణించాలన్న ఒక చానల్ నిర్వాహకులు రేటింగ్ కోసం బ్రేకింగ్ న్యూస్ కోసం కృషి చేస్తారన్నారు. ఆ చానల్‌లో నటి చార్మి విలేకరిగా పని చేస్తుంటారని చెప్పారు. అలా సంచలన వార్తల కోసం అన్వేషిస్తున్న ఆమెకు ఒక పెన్‌డ్రైవ్ దొరుకుతుందన్నారు. ఆ పెన్‌డ్రైవ్‌ను పొందాలనే సంఘ విరోధులకు హీరో జగపతిబాబు మధ్య జరిగే పోరే తలైప్పుసెయ్‌ది చిత్ర కథ అని అన్నారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.