జనగామ మార్కెట్‌లో హరీష్‌ రావు తనిఖీలు | minister harish rao checks in jangaon market | Sakshi
Sakshi News home page

జనగామ మార్కెట్‌లో హరీష్‌ రావు తనిఖీలు

Jan 21 2017 1:58 PM | Updated on Sep 5 2017 1:46 AM

జనగామలోని మార్కెట్‌ యార్డును మంత్రులు హరీష్‌రావు, మహేందర్‌రెడ్డిలు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జనగామ: జనగామలోని మార్కెట్‌ యార్డును మంత్రులు హరీష్‌రావు, మహేందర్‌రెడ్డిలు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్‌లోని కంది రైతులతో మాట్లాడిన హరీష్‌రావు కందుల కొనుగోలుకు 80 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తేమ లేని ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు సహకరించాలన్నారు. గత రెండు రోజులుగా ఈ మార్కెట్‌లో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రులు ఈ రోజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం అక్కడి నుంచి వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలోని వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లారు.
 

Advertisement
 
Advertisement
Advertisement