పది నిమిషాలకే గేట్లు మూసేస్తారా.!

Farmers Protest in Front of Janagama Agricultural Market - Sakshi

జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌ ఎదుట రైతులు సోమవారం నిరసన తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మార్కెట్‌కు సరుకులు తీసుకు రావాలనే నిబంధన విధించారు. రెండు సంవత్సరాలుగా సమయపాలనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కురిసిన జోరు వర్షాలు.. ఉదయం 10 గంటల వరకు వాతావరణం పొడిగా ఉంటుండడంతో.. కోతలు ఆలస్యమవుతున్నాయి. రైతులు యంత్రాల సహాయంతో వరిపంటను కోసి.. మార్కెట్‌కు వచ్చే సరికి కొంతమేర ఆలస్యమవుతుంది. 12 గంటలకు గేట్లు మూసివేస్తుండగా..పదినిమిషాలు ఆలస్యంగా వచ్చినా... లోనికి అనుమతి నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top