వేపచెట్టు నుంచి..పాలు

milk out from Neem tree in orissa state - Sakshi

భక్తి శ్రద్ధలతో ప్రజల  పూజలు

బరంపురం: గంజాం జిల్లాలోని కళ్లికోట్‌ ప్రాంతంలో వేపచెట్టు  నుంచి రెండురోజులుగా ఏకధాటిగా పాలు కారుతున్న దృశ్యం స్థానికులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కళ్లికోట్‌ బ్లాక్‌ పరిధి డిమిరియా పంచాయతీలోని పొలుదుపల్లి గ్రామ శివారు ఒక పొలంలో వేపచెట్టు నుంచి రెండు రోజులుగా పాలు కారుతున్నాయి. మంగళవారం ఉదయం పొలం పనికి వెళ్లిన సుదర్శన్‌ నాయక్‌ దీన్ని చూసి ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. దీంతో ఆనోటా ఈనోటా విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు తండోపతండాలుగా చేరుకున్నారు. మరి కొంత మంది మహిళలు పసుపు, కుంకుమలతో భక్తి శ్రద్ధలతో వేపచెట్టుకు పూజలు చేశారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top