మేల్‌నాట్టు మరుమగన్ వస్తున్నాడు | melnattu marumagal movie is coming | Sakshi
Sakshi News home page

మేల్‌నాట్టు మరుమగన్ వస్తున్నాడు

Jan 30 2015 12:45 AM | Updated on Sep 2 2017 8:29 PM

మేల్‌నాట్టు మరుమగన్ వస్తున్నాడు

మేల్‌నాట్టు మరుమగన్ వస్తున్నాడు

మేల్‌నాట్టు మరుమగన్ (విదేశీ అల్లుడు) త్వరలో తెరపైకి రానున్నాడు. డబ్బు, సంపాదన ఆశతో కొందరు విదేశాలకు

మేల్‌నాట్టు మరుమగన్ (విదేశీ అల్లుడు) త్వరలో తెరపైకి రానున్నాడు. డబ్బు, సంపాదన ఆశతో కొందరు విదేశాలకు     పరుగులు తీస్తున్నా సంస్కృతి, సంప్రదాయాల్లో మనదేశానికి మించిన దేశం లేదు అన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం మేల్‌నాట్టు మరుమగన్ అని ఆ చిత్ర దర్శకుడు ఎం ఎస్ ఎస్ చెప్పారు. స్కై మూవీస్ పతాకంపై తమిళనాడు ఎస్.బహుదూర్‌షా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవనటుడు రాజ్‌కమల్ కథానాయకుడిగాను, ఆండ్రియన్ నాయకిగాను పరిచయం అవుతున్నారు. చిత్ర కథ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి కావడంతో షూటింగ్ మొత్తం తమిళనాడులోనే నిర్వహించినట్లు దర్శకుడు వెల్లడించారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చెప్పారు. వి.కిషోర్‌కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ వెంటనే చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement