అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి | Married, died under suspicious circumstances | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Mar 16 2017 2:40 AM | Updated on Nov 6 2018 7:53 PM

అనుమానస్పద రీతిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన బుచ్చిరెడ్డిపల్లెలో బుధవారం జరిగింది. తిరుత్తణి సమీపంలోని బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన విజయ్‌ నేత కార్మికుడు.

తిరుత్తణి : అనుమానస్పద రీతిలో ఓ  వివాహిత మృతి చెందిన సంఘటన బుచ్చిరెడ్డిపల్లెలో బుధవారం జరిగింది. తిరుత్తణి సమీపంలోని బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన విజయ్‌ నేత కార్మికుడు. ఆర్కేపేటకు చెందిన విజయతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులకు ఏడాది వయస్సు పాప ఉంది. గత కొంత కాలంగా దంపతుల మధ్య తరుచూ తగాదాలు జరిగేవని దీంతో విజయ తన పుట్టింటికి వెళ్లిపోయింది. పది రోజుల కిందట ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడి విజయను భర్తతో కాపురానికి పంపారు.

 ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లో బిడ్డ ఏడుపును విన్న సమీప కుటుంబీకులు వెళ్లి చూడగా అనుమానాస్పద రీతిలో ఉరేసుకుని విజయ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని విచారించే సమాయానికే ఆమె భర్త, అత్తమామలు పరారయ్యారు. కాగా వివాహం జరిగి మూడేళ్ల వ్యవధిలోనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై ఆర్డీవో విమల్‌రాజ్‌ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement