దేశంలో కాంగ్రెస్ బలోపేతానికి కామరాజ్ ప్లాన్ -2ను అమలు చేయాలని మర్రి శశిధర్ రెడ్డి సూచించారు.
సీడబ్ల్యూసీ సభ్యులంతా రాజీనామా చేయాలి
Mar 16 2017 3:49 PM | Updated on Sep 5 2017 6:16 AM
హైదరాబాద్: దేశంలో కాంగ్రెస్ బలోపేతానికి 1963 నాటి కామరాజ్ ప్లాన్ -2ను అమలు చేయాలని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సూచించారు. రాహుల్ గాంధీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ సభ్యులంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై తాను హైకమాండ్‌కు లేఖ రాశానన్నారు. విపత్తులు సంభవించినప్పుడు.. గెలుపుకు అదో అవకాశంగా భావించాలన్నారు. పార్టీలో సమర్థులైన యువకులకు అవకాశాలు కల్పించాలని కోరారు.
ఏఐసీసీ ప్రక్షాళనతోనే పార్టీకి పూర్వవైభవం దక్కుతుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో పాతుకుపోయిన సీనియర్ నేతలను వారి వారి సొంత రాష్ట్రాలకు పంపేయాలని సూచించారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల ఇన్‌చార్జిలు కూడా మారాల్సిందేనన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రక్షాళన జరగాలా వద్దా అనేది అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని, 2019 లో కాంగ్రెస్‌దే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement