ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బూటు విసిరాడు | Man throws shoe at Delhi CM Kejriwal during ‘odd-even’ announcement | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బూటు విసిరాడు

Apr 9 2016 5:23 PM | Updated on Sep 3 2017 9:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బూటు విసిరాడు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బూటు విసిరాడు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై మరోసారి దాడి జరిగింది. శనివారం మీడియా సమావేశంలో కేజ్రీవాల్ సరి-బేసి ట్రాఫిక్ నిబంధనల గురించి మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి ఆయనపై బూటు, సీడీలను విసిరాడు.

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై మరోసారి దాడి జరిగింది. శనివారం మీడియా సమావేశంలో కేజ్రీవాల్ సరి-బేసి ట్రాఫిక్ నిబంధనల గురించి మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి ఆయనపై బూటు, సీడీలను విసిరాడు. ఇవి సీఎం పక్కనపడ్డాయి. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. కేజ్రీవాల్పై బూటు విసిరిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఆమ్ ఆద్మీ సేనకు చెందిన వేద్ ప్రకాశ్గా గుర్తించారు. పోలీసులు నిందితుడిని ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్కు తరలించిన అనంతరం కేజ్రీవాల్ మీడియా సమావేశాన్ని కొనసాగించారు.

కేజ్రీవాల్పై జరిగిన దాడిని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఖండించారు. కాగా కేజ్రీవాల్పై గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. 2014లో ఢిల్లీలోని సుల్తాన్ పురి ప్రాంతంలో రోడ్డు షో సందర్భంగా ఓ వ్యక్తి కేజ్రీవాల్ చెంప కొట్టాడు. అదే ఏడాది హరియాణాలో మరో వ్యక్తి కేజ్రీవాల్ పై దాడికి ప్రయత్నించాడు. ఈ ఏడాది జనవరిలో ఓ మహిళ కేజ్రీవాల్పై ఇంకు చెల్లేందుకు ప్రయత్నించింది.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement