పెళ్లైన నెలరోజులకే వేరే వ్యక్తితో వధువు పరార్‌! | man killed over marital disputes in chennai | Sakshi
Sakshi News home page

పెళ్లైన నెలరోజులకే వేరే వ్యక్తితో వధువు పరార్‌!

Feb 22 2017 7:20 PM | Updated on Jul 30 2018 8:37 PM

పెళ్లైన నెలరోజులకే వేరే వ్యక్తితో వధువు పరార్‌! - Sakshi

పెళ్లైన నెలరోజులకే వేరే వ్యక్తితో వధువు పరార్‌!

తమిళనాడులోని సేలంలో వివాహం జరిగిన నెల రోజుల్లోనే నవవధువు బావతో పరారైంది.

చెన్నై‌:
తమిళనాడులోని సేలంలో వివాహం జరిగిన నెల రోజుల్లోనే నవవధువు బావతో పరారైంది. ఆమె కోసం వెళ్లిన మామ హత్యగురయ్యాడు. సేలం ఎంజీఆర్‌ నగర్‌కు చెందిన పచ్చియప్పన్‌ (60) గాజులవ్యాపారి. ఇతని కుమారుడు జగన్నాథన్‌ (28)కు, సేలం జిల్లా తీవట్టిపట్టికి చెందిన అనిత (22)కు వివాహం జరిగింది.

వివాహమైన నెల రోజుల్లోనే అనిత పుట్టింటికి చేరి మేనమామ కుమారుడు లక్ష్మణన్‌తో వెళ్లిపోయి వేలూరులో కాపురం పెట్టింది. లక్ష్మణన్‌ వేలూరులో ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలో పచ్చియప్పన్‌ పెళ్లి ఖర్చులకు రూ.40 వేలు అయ్యిందని దాన్ని తిరిగివ్వాలని కోరారు. అందుకు వారు ఒప్పుకోకపోవడంతో ఘర్షణ జరిగింది. పచ్చయప్పన్‌కు తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మృతి చెందాడు. పోలీసులు లక్ష్మణన్, అనితలను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement