యాష్‌ పాండ్‌లో ప్రమాదం: యువకుడు మృతి | man dies due to ysah pond accident in bhadradri | Sakshi
Sakshi News home page

యాష్‌ పాండ్‌లో ప్రమాదం: యువకుడు మృతి

May 23 2017 1:01 PM | Updated on Sep 5 2017 11:49 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌ యాష్ పాండ్‌లో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు.

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌ యాష్ పాండ్‌లో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. డోజర్‌ కిందపడి దాసరి కృష్ణబాబు(19) అనే వ్యక్తి మృతి చెందాడు. కేటీపీఎస్‌ 6వ దశ యాష్‌ పాండ్‌ నిర్మాణంలో అన్‌లోడింగ్‌ పాయింట్‌ సూపర్‌వైజర్‌గా ఇతను పనిచేస్తున్నాడు. రాత్రి డోజర్‌ వెనుక ఉన్న మట్టికుప్ప వద్ద పడుకుని ఉండగా అర్ధరాత్రివేళ ఇతనిని గమనించని డ్రైవర్‌ డోజర్‌ను వెనక్కు నడిపాడు. దీంతో చక్రాలు అతని మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతడిని కృష్ణా జిల్లా మచిలీపట్నం నివాసిగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని కొత్తగూడెం డీఎస్పీ భాస్కరరావు, రూరల్‌ సీఐ సత్యనారాయణలు పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement