తాగేందుకు డబ్బు ఇవ్వలేదని సోదరుడి హత్య | lorry cleaner killed brother for liquor in banglore | Sakshi
Sakshi News home page

తాగేందుకు డబ్బు ఇవ్వలేదని సోదరుడి హత్య

Oct 2 2016 10:22 AM | Updated on Jul 30 2018 8:29 PM

తాగేందుకు డబ్బు ఇవ్వలేదని సోదరుడి హత్య - Sakshi

తాగేందుకు డబ్బు ఇవ్వలేదని సోదరుడి హత్య

మద్యం మహామ్మారీతో ఎలాంటి ఘాతుకాలు జరుగుతాయో ఈ ఘటన అద్దం పడుతుంది.

బెంగళూరు(దొడ్డబళ్లాపురం): మద్యం మహామ్మారీతో ఎలాంటి ఘాతుకాలు జరుగుతాయో ఈ ఘటన అద్దం పడుతుంది. తాగడానికి డబ్బులివ్వలేదని సొంత అన్ననే తమ్ముడు కడతేర్చాడు. ఈ ఘటన శనివారం దేవనహళ్లి తాలూకాలో చోటు చేసుకుంది. వివరాలు...తాలూకాలోని హారోహళ్లికి చెందిన వెంకట్‌గౌడ(45),రాజశేఖర్‌లు అన్నదమ్ములు. ఇద్దరూ లారీ క్లీనర్లుగా పనిచేస్తున్నారు.

అయితే మద్యానికి బానిసైన రాజశేఖర్‌ అప్పుడప్పుడూ తాగడానికి డబ్బులివ్వాలని అన్న వెంకట్‌ను అడుగుతుండేవాడు. శనివారం కూడా డబ్బులివ్వాలని కోరగా తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఓ దశలో విచక్షణ కోల్పోయిన రాజశేఖర్‌ కత్తితో వెంకట్‌ను పొడిచి హత్య చేశాడు. వెంకట్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజశేఖర్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement