భూదాన్’ పేరుతో మోసం | Land grabbing in hayatnagar at rangareddy district | Sakshi
Sakshi News home page

భూదాన్’ పేరుతో మోసం

Oct 1 2016 2:13 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లాలో భూదాన్‌ భూమి పేరుతో పేదలను మోసం చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- 8 మంది అరెస్టు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుట్లూరులో భూదాన్‌ భూమి పేరుతో పేదలను మోసం చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలోని సర్వే నంబర్- 215 నుంచి 224 మధ్యగల భూమి భూదాన్‌ ట్రస్టుకు సంబంధించినదంటూ కొందరు వ్యక్తులు పేదలను ముగ్గులోకి దించారు.
 
అందుకుగాను కేసీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే పేరు పెట్టి ఒక్కో వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేశారు. వారికి నకిలీ పట్టాలు ఇచ్చి.. ఆ స్థలంలో గుడిసెలు వేయించారు. ఈ తతంగం అంతా తెలుసుకున్న అసలు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూత్రధారులైన 8మందిని శనివారం అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement