రైతుల సమస్యలను పట్టించుకోవాలి | L.ramana about formers problems | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలను పట్టించుకోవాలి

Oct 14 2016 3:55 AM | Updated on Aug 14 2018 10:51 AM

రైతుల సమస్యలను పట్టించుకోవాలి - Sakshi

రైతుల సమస్యలను పట్టించుకోవాలి

సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఫాంహౌజ్‌ను వీడి రైతుల సమస్యలను పట్టించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర

వరంగల్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఫాంహౌజ్‌ను వీడి రైతుల సమస్యలను పట్టించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  ఎన్నికలకు ముందు కేసీఆర్ చెప్పినట్లుగా ఏ రైతుకూ రుణమాఫీ కాలేదన్నారు. ప్రభుత్వం విడతల వారీగా ఇస్తున్న రుణమాఫీ బ్యాంకుల వడ్డీలకే సరిపోతుందన్నారు.  

రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలి : రేవంత్‌రెడ్డి
ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు సంతోషంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ చెబుతున్నారని.. ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు ధర్నాలు చేస్తుంటే పాలకులకు కనపడడం లేదా? అని రేవంత్ ప్రశ్నించారు. నకిలీ విత్తనాలపై విచారణ జరిపి నివేదికలు ప్రభుత్వానికి ఇచ్చిన వ్యవసాయశాఖ కార్యదర్శి ప్రియదర్శిని ఆ కంపెనీకి నోటీసులు ఇస్తే సీఎం కేసీఆర్ ఒత్తిడి మేరకు దీర్ఘకాలపు సెలవుపై వెళ్లారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement