తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. జయలలిత సిట్టింగ్ స్థానమైన ఆర్కే నగర్ నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. పార్టీ నేతలతో కలసి వచ్చిన జయ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు.
కరుణానిధి సొంతూరు తిరువరూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కొలతూర్ నుంచి పోటీ చేస్తున్న కరుణానిధి కుమారుడు స్టాలిన్ 27న నామినేషన్ వేస్తారు. డీఎండీకే చీఫ్ విజయ్కాంత్, ఎండీఎంకే అధ్యక్షుడు వైకో ఈ వారంలో నామినేషన్లు వేయనున్నారు.