ఫెర్టిలిటీ ఆస్పత్రిపై ఐటీ దాడులు.. భారీగా ఆస్తులు | it raids on doctor padmaja fertility hospitals | Sakshi
Sakshi News home page

ఫెర్టిలిటీ ఆస్పత్రిపై ఐటీ దాడులు.. భారీగా ఆస్తులు

Jan 10 2017 4:19 PM | Updated on Sep 27 2018 3:37 PM

ఫెర్టిలిటీ ఆస్పత్రిపై ఐటీ దాడులు.. భారీగా ఆస్తులు - Sakshi

ఫెర్టిలిటీ ఆస్పత్రిపై ఐటీ దాడులు.. భారీగా ఆస్తులు

ఆదాయ పన్ను కట్టకుండా ఎగనామం పెట్టిన ఓ సంతాన సాఫల్య ఆస్పత్రిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

యాదాద్రి‌: ఆదాయ పన్ను కట్టకుండా ఎగనామం పెట్టిన ఓ సంతాన సాఫల్య ఆస్పత్రిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఏక కాలంలో ఆ ఆస్పత్రికి చెందిన ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రులు, వారి నివాసాలపై ఉదయం నుంచి సోదాలు ప్రారంభించి లెక్కకు మించిన ఆస్తులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. భువనగిరిలోని డాక్టర్‌ పద్మజ ఫెర్టిలిటీ ఆస్పత్రి ఉంది.

అందులో డాక్టర్‌ పద్మజ ఫెర్టిలిటీ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీరికి హైదరాబాద్‌లోని హబ్సీగూడలో కూడా సంతాన సాఫల్య కేంద్రం ఉంది. గత రెండేళ్లుగా ఈ ఆస్పత్రులకు చెందిన యాజమాన్యం ఆదాయ పన్నుకట్టడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఒకేసారి ఐటీ అధికారులు దాడులకు దిగారు. చట్ట విరుద్ధంగా నిర్వహించిన సరోగసి, పలు కాన్పుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు విలువైన పత్రాలు గుర్తించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement