అమ్మో మొసలి.. కాస్తంతలో తప్పిందే ! | Informed tappinde in crocodile | Sakshi
Sakshi News home page

అమ్మో మొసలి.. కాస్తంతలో తప్పిందే !

Mar 8 2016 2:25 AM | Updated on Sep 3 2017 7:12 PM

ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్న హీరో, హీరోయిన్‌లు ధనుంజయ్, పారుల్‌లు కాస్తంతలో మొసలి బారి నుంచి తప్పించుకున్నారు.

బెంగళూరు: ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్న హీరో, హీరోయిన్‌లు ధనుంజయ్, పారుల్‌లు కాస్తంతలో మొసలి బారి నుంచి తప్పించుకున్నారు. అయితే ఆ విషయం వాళ్లకు కూడా ఆలస్యంగా తెలియడమే గమనార్హం. వివరాలు.. జెస్సీ సినిమా చిత్రీకరణలో భాగంగా గత ఏడాది అక్టోబర్‌లో హీరో, హీరోయిన్‌లు ధనుంజయ్, పారుల్‌లపై ఓ పాటను చిత్రీకరించారు. సిగందూరులోని ఓ సరస్సులో నీటి తెప్పపై వెళుతున్న సందర్భంగా ఈ పాట చిత్రీకరణ సాగింది. ఆ సమయంలో హీరో, హీరోయిన్‌లు కూర్చున్న తెప్పకు అతి సమీపంలోనే ఓ మొసలి కనిపించింది.

అయితే షూటింగ్ సమయంలో ఈ విషయాన్ని హీరో, హీరోయిన్‌లతో పాటు యూనిట్ సభ్యులెవ రూ కూడా గుర్తించలేదు. తమ షూటింగ్‌ను పూర్తి చేసుకొని వారు అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు. అయితే ఈ పాటకు సంబంధించిన ఎడిటింగ్ పనులను ఆదివారం నిర్వహిస్తుండగా యూనిట్ సభ్యులకు షాక్ తగిలినంత పనైంది. ధనుంజయ్, పారుల్‌లు కూర్చున్న తెప్ప పక్కనే మొసలిని చూసిన యూనిట్ సభ్యులంతా ‘అమ్మో మొసలి, కాస్తంతలో తప్పిందే, అదృష్టవంతులు’ అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement