బెంగళూరు నగర బస్సు సర్వీసులు చార్జీలు పెరిగాయి | Increased charges for the location of the bus services in Bangalore | Sakshi
Sakshi News home page

బెంగళూరు నగర బస్సు సర్వీసులు చార్జీలు పెరిగాయి

Apr 25 2014 2:09 AM | Updated on May 24 2018 1:29 PM

బెంగళూరు నగర బస్సు సర్వీసులు ‘బీఎంటీసీ’లో గురువారం అర్ధరాత్రి నుంచి చార్జీలు పెరిగాయి. సగటున 15 శాతం మేరకు పెంచారు.

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరు నగర బస్సు సర్వీసులు ‘బీఎంటీసీ’లో గురువారం అర్ధరాత్రి నుంచి చార్జీలు పెరిగాయి. సగటున 15 శాతం మేరకు పెంచారు. డీజిల్ ధర పెంపుతో పాటు కార్మికులకు డీఏ పెంచిన నేపథ్యంలో చార్జీలను పెంచడానికి అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని కోరింది.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గురువారం నుంచి నియమావళిని ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద చార్జీల పెంపునకు అనుమతినిచ్చింది. ఇదే బాటలో ఆర్టీసీ బస్సు చార్జీలూ పెరగనున్నాయి. విద్యుత్ చార్జీల పెంపునకు కూడా రంగం సిద్ధమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement