Sakshi News home page

బీజేపీలో నైరాశ్యం

Published Sat, Sep 12 2015 3:52 AM

బీజేపీలో నైరాశ్యం - Sakshi

బెంగళూరు(బనశంకరి) :  బీబీఎంపీ ఎన్నికల్లో బీజేపీని వంద స్థానాల్లో గెలుపించిన సామ్రాట్‌గా పేరుపొందిన మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్ నడవడికే వారిని ముంచింది. బేషరత్తుగా మద్దతు ఇస్తామంటూ అశోక్ వద్దకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను అశోక్ నిర్లక్ష్యం చేయడమే ఆ పార్టీని అధికారానికి దూరం చేసింది.  అశోక్ దురహంకార ధోరణితోనే చేతులారా బీబీఎంపీని వదులుకోవాల్సి వచ్చిందని రాజకీయవర్గాల్లో వినిపిస్తుంది. రాజకీయబద్ద శత్రువులుగా ముద్రపడ్డ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హెచ్‌డీ దేవెగౌడ బీబీఎంపీని దక్కించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికారు.

ఈ స్నేహం రానున్న జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతుందని వినబడుతుంది. బీబీఎంపీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలుపొందిన అధికారం చేపట్టడంలో విఫలమైన పార్టీ నేతలపై పాలికె సభ్యులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, బీబీఎంపీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్  స్థానాలను కైవశం చేసుకోవడంతో కాంగ్రెస్, జేడీయస్ పార్టీ శ్రేణుల్లో ఆనందాలు మిన్నంటాయి. బీబీఎంపీలో మేయర్ ఎన్నిక ముగిసిన వెంటనే ప్రవేశద్వారం ద్వారా వందలాదిమంది 

కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. నిషేదాజ్ఞలు అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు  గుంపులుగా చేరిన కార్యకర్తలను చెదరగొట్టారు. అయినప్పటికీ వందలాది సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అంతేగాక కేపీసీసీ కార్యాలయం వద్ద బాణాసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు.  అలాగే జేడీఎస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా సంబరాలు మిన్నం టాయి.  8 ఏళ్ల అనంతరం జేడీఎస్- కాంగ్రెస్ కూటమిగా ఏర్పడటం రాష్ట్రరాజకీయాల్లో సంచలనానికి తెరలేపింది.  
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement