‘నేను ఆయన్ను ఇబ్బంది పెట్టానని డీఎస్పీ గణపతి స్టేట్‌మెంట్ ఇచ్చారు.
డీఎస్పీ గణపతి ఆత్మహత్య పై కె.జె.జార్జ్ ప్రశ్న
బెంగళూరు: ‘నేను ఆయన్ను ఇబ్బంది పెట్టానని డీఎస్పీ గణపతి స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉన్నాయా’ అంటూ బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కె.జె.జార్జ్ ప్రశ్నించారు. సోమవారమిక్కడి విధానసౌధ వద్ద తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు.
‘ఈ విషయంపై హోం శాఖ మంత్రి పరమేశ్వర్ సభలో వివరణ ఇచ్చిన తర్వాత నా పై వ్యక్తిగతంగా ఆరోపణలు వస్తే అందుకు నేను సమాధానం ఇస్తాను. గణపతి కుటుంబ సభ్యులు నా పై కేసు పెడితే పెట్టనివ్వండి, చట్ట ప్రకారమే విచారణ జరుగుతోంది, విచారణ అనంతరం అన్ని విషయాలు తెలుస్తాయి’ అని పేర్కొన్నారు.