కొండపై జారిపడ్డ హైదరాబాద్‌ యువకుడు

Hyderabad young man Slipped over the hill - Sakshi

     తిరువణ్ణామలైలో ప్రమాదం 

     3 రోజుల తర్వాత రక్షించిన పోలీసులు 

తిరువణ్ణామలై (తమిళనాడు): తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ మహాకొండపై హైదరాబాద్‌కు చెందిన యువకుడు కాలుజారి పడిపోయాడు. హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్వరరావు కుమారుడు తరుణ్‌ (24) 8వ తేదీన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుని దర్శించుకున్నాడు. కందాశ్రమం దారిలో మహాకొండగా భావించే 2,666 అడుగుల ఎత్తుగల కొండపైకి ఎక్కాడు. అన్నామలై ప్రాంతంలో ప్రమాదవశాత్తూ కాలుజారి పల్లంలో పడిపోయాడు.

ప్రమాదంలో తరుణ్‌ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ నుంచి రాలేక.. 2 రాత్రులు, పగలు పూర్తిగా అక్కడే ఉండిపోయాడు. అనంతరం కాలు కొంత సహకరించడం, సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ అందడంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని కుటుంబీకులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువణ్ణామలై ఎస్పీ పొన్నికి హైదరాబాద్‌ పోలీసులు మంగళవారం సమాచారం అందజేశారు. 20 మంది పోలీసులు తరుణ్‌ను గాలించి మంగళవారం సాయంత్రం బయటకు తీసుకొచ్చారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top