పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో బుధవారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు.
నిడదవోలులో భారీ చోరీ
May 11 2017 12:22 PM | Updated on Sep 5 2017 10:56 AM
నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో బుధవారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. స్థానిక కెనరా బ్యాంకు వీధిలో నివాసముంటున్న ఉద్దగిరి సత్యవతి ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఏడు తులాల బంగారు ఆభరణాలతో పాటు 6 కిలోల వెండి వస్తువులు అపహరించుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Advertisement
Advertisement