పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి..వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు.
మద్యం మత్తులో పాఠశాలకు..
Feb 23 2017 11:17 AM | Updated on Sep 5 2017 4:26 AM
గార్లదిన్నె: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు. దీంతో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట గ్రామంలోని ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విజయ్‌భాస్కర్ పని చేస్తున్నారు. కాగా విజయ్‌భాస్కర్ పాఠశాలకు మద్యం మత్తులో హాజరవుతున్నట్లు విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన డీఈవో విజయ్‌భాస్కర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement


