మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య | Female constable suicide | Sakshi
Sakshi News home page

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Jun 3 2018 8:37 AM | Updated on Nov 6 2018 8:16 PM

Female constable suicide - Sakshi

హొసూరు: జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో ఓ మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. క్రిష్ణగిరి జక్కప్పనగర్‌లోని ప్రభుత్వ పోలీస్‌ గృహవసతి కాలనీలో నివసిస్తున్న గాంధిమతి క్రిష్ణగిరి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. శనివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా, పట్టణ పోలీసులు కణ్ణన్, సెల్వరాజ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని కానిస్టేబుల్‌ శవాన్ని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకొందా? లేక వేరే కారణాలున్నాయా? అని విచారణ జరుపుతున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement