కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయం | drugs gang busted in nizampet | Sakshi
Sakshi News home page

కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయం

Oct 1 2016 12:27 PM | Updated on May 25 2018 2:29 PM

కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయం - Sakshi

కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయం

కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: నిజాంపేటలో కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక రాజీవ్‌గాంధీ నగర్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్న కొందరి ఇళ్లపై శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వారి నుంచి 4 బ్యాగుల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు మత్తు పదార్థాలను దొంగచాటుగా కొనుగోలు చేసి, వాటిని విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement