లండన్‌లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక అంతర్జాతీయ ముఠా గుట్టును మెట్రోపాలిటన్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలోని ఐదుగురు సభ్యులకు కలిపి లండన్‌లోని కింగ్‌స్టన్ క్రౌన్ కోర్టు మొత్తం 84 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది.
శిక్ష పడిన వారిలో బర్మింగ్‌హామ్‌కు చెందిన భారత సంతతి వ్యక్తి జగ్‌జీత్ సింగ్ (30) కూడా ఉన్నాడు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ సరఫరా చేయడంలో జగ్‌జీత్ కీలక పాత్ర పోషించాడు. ఈ కేసులో జగ్‌జీత్ సింగ్‌కు 10 సంవత్సరాల 6 నెలల శిక్ష పడింది. జగ్‌జీత్ గత అక్టోబర్‌లోనే తన నేరాన్ని అంగీకరించాడు.
ఇక మిగిలిన నలుగురు నిందితులకు వారి నేర తీవ్రతను బట్టి 14 నుండి 26 ఏళ్ల వరకు జైలు శిక్షలు పడ్డాయి. కాగా 300 కిలోల కొకైన్, 60 కిలోల హెరాయిన్ సీజన్ చేసినట్లు యూకే మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో విలువ సుమారు 8 మిలియన్ పౌండ్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.
అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 84 కోట్లు. వీరు ఐరోపా దేశాల నుండి బ్రిటన్‌కు డ్రగ్స్ తెచ్చి సరఫరా చేసేవారు. ఈ ముఠా డ్రగ్స్ రవాణా కోసం అత్యంత అధునాతనమైన సాంకేతికతను ఉపయోగించినట్లు ఈ కేసు దర్యాప్తు అధికారి ఒక తెలిపారు.


