ఈసారి ఎన్నికల్లో తాము క్లీన్‌స్వీప్ చేయబోతున్నట్టు ఆమ్‌ఆద్మీ పార్టీ ఆదివారం ప్రకటించింది. తాము సొంతగా నిర్వహించుకున్న సర్వేలో ఈ విషయం వెల్లడయిందని తెలిపింది.
మేమే గెలుస్తాం: ‘ఆప్’
Dec 2 2013 12:55 AM | Updated on Apr 4 2018 7:42 PM
	న్యూఢిల్లీ: ఈసారి ఎన్నికల్లో తాము క్లీన్‌స్వీప్ చేయబోతున్నట్టు ఆమ్‌ఆద్మీ పార్టీ ఆదివారం ప్రకటించింది. తాము సొంతగా నిర్వహించుకున్న సర్వేలో ఈ విషయం వెల్లడయిందని తెలిపింది. ఢిల్లీలో తమ ప్రభంజనం కొనసాగుతున్నందున, 38-50 వరకు సీట్లు వస్తాయని ఆప్ నాయకుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు. కాంగ్రెస్‌కు 14, బీజేపీకి 17 వరకు సీట్లు వస్తాయని ఆయన తెలి పారు. మొత్తం ఓట్లలో ఆప్‌కు 36 శాతం దక్కుతాయని, బీజేపీ 27 శాతం, కాంగ్రెస్‌కు 26 శాతం వస్తాయని వివరించారు. సీఐసీఈఆర్‌ఓ అసోసియేట్స్ అనే సంస్థ 1,643 మందిని ప్రశ్నిం చి ఈ సర్వే చేసిందని యాదవ్ పేర్కొన్నారు. 
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
