గంగూలీపై ఫిర్యాదు చేయండి | Delhi Police ask law intern to register complaint; Sibal says SC must take case forward | Sakshi
Sakshi News home page

గంగూలీపై ఫిర్యాదు చేయండి

Dec 7 2013 2:48 AM | Updated on Sep 2 2018 5:20 PM

తనను లైంగికంగా వేధించాడంటూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏకే గంగూలీపై ఆరోపణలు చేసిన బాధితురాలు తమకు ఫిర్యా దు చేయాలని ఢిల్లీ పోలీసులు కోరారు.

సాక్షి, న్యూఢిల్లీ: తనను లైంగికంగా వేధించాడంటూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏకే గంగూలీపై ఆరోపణలు చేసిన బాధితురాలు తమకు ఫిర్యా దు చేయాలని ఢిల్లీ పోలీసులు కోరారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకునే విషయమై పరిశీలిస్తామని న్యూఢిల్లీ ఎస్‌బీఎస్ త్యాగి తెలి పారు. ‘ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి, తన వాంగ్మూలాన్ని రికార్డు చేయవలసిందిగా బాధితురాలికి ఈ-మెయిల్ పంపాం. ఆమె ముందుకొచ్చి ఫిర్యాదు చేసినట్లయితే చేపట్టవలసిన తదుపరి చర్యల విషయమై పరిశీలిస్తాం. ఈ విషయంలో న్యాయనిపుణుల నుంచి ఎలాంటి సహాయాన్ని కోరలేదు.
 
 వాంగ్మూలాన్ని నమోదుచేసుకోవడానికి ఎప్పుడు? ఎక్కడికి? రావాలో తెలపాల్సిందిగా మాత్రమే బాధితురాలిని మెయిల్‌లో కోరామ’ని త్యాగి చెప్పారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు  చే యవలసిందిగా కోరుతూ ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యాయశాస్త్ర విభాగం మాజీ ప్రొఫెసర్  ఇదివరకే   తిలక్‌మార్గ్ స్టేషన్‌హౌజ్ ఆఫీసర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీ సులు ఆయన పిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోనప్పటికీ బాధితురాలు ముందుకొచ్చినట్లయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలనుకుంటున్నారు.
 
 లా ఇంటర్న్‌గా పనిచేస్తున్న తనను గత సంవత్సరం డిసెంబర్‌లో ఢిల్లీలోని హోటల్ గదిలో ఏకే గంగూలీ  లైంగికంగా వేధించారంటూ ఓ యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఆమె బ్లాగ్ ద్వారా వెల్లడించింది. కాగా గంగూలీ ఈ ఆరోపణలను ఖండించారు. గంగూలీ ఏడాది కిందట సుప్రీంకోర్టు  న్యాయమూర్తిగా  పనిచేశారు. ఇప్పుడాయన పశ్చిమ బెంగాల్ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు. యువతి ఆరోపణలను పరిశీలించడం కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో నియమించిన కమిటీ కూడా గంగూలీ ప్రవర్తనను తప్పుపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement