తల్లి మందుల కోసం టిక్‌టాక్‌; స్పందించిన సీఎం

Daughter Doing TikTok For Mother Medication In Karnataka - Sakshi

సాక్షి, బొమ్మనహళ్లి: బెళగావి జిల్లాలోని రాయదుర్గ తాలూకాలోని నరసాపుర గ్రామానికి చెందిన శేఖవ్వ అనే మహిళకు రెండి కిడ్నీలు దెబ్బతినడంతో భర్త ఒక కిడ్నీ దానం చేయగా ఆమెకు అమర్చారు. జనవరిలో ఆపరేషన్‌ జరగ్గా, ఇంట్లో ఔషధాలు వాడుతూ విశ్రాంతి తీసుకుంటోంది. 20 రోజుల నుంచి లాక్‌డౌన్‌ వల్ల ఆమెకు కావాలసిన మందులు దొరకడం లేదు.

ఫలితంగా రోజురోజుకూ నీరసించి ఆరోగ్యం విషమిస్తోంది. దీంతో  కూతురు పవిత్ర తన తల్లి బాధను వివరిస్తూ టిక్‌టాక్‌ వీడియో చేసింది. దీంతో సీఎం యడియూరప్ప సూచన మేరకు జిల్లా అధికారులు శనివారం ఆమె ఇంటికి వెళ్లి నెల రోజులకు సరిపడా మందులను అందజేశారు. ఏదైనా సమస్య ఉంటే తెలియజేయాలని సూచించారు. చదవండి: లాక్‌డౌన్‌: అయ్యా..బాబూ.. ఆదుకోండయ్యా! 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top