రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలోని సర్వన్‌పల్లి ప్రాజెక్ట్ కట్ట రెండున్నరడుగుల మేర కుంగింది.
కుంగిన సర్వన్‌పల్లి ప్రాజెక్ట్ కట్ట
Sep 26 2016 12:10 PM | Updated on Mar 28 2018 11:26 AM
ధారూర్: రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలోని సర్వన్‌పల్లి ప్రాజెక్ట్ కట్ట రెండున్నరడుగుల మేర కుంగింది. విషయం తెలుసుకున్న ప్రాజెక్ట్ ఎస్‌ఈలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 2.92 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో నాణ్యత లేకపోవడంతోనే కట్ట కుంగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement