అన్నానగర్ (చెన్నై): ఇరాన్ నుంచి తమిళనాడుకు సముద్ర మార్గంలో అక్రమంగా తీసుకొచ్చిన రూ.9.7 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను చెన్నై కస్టమ్స్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన రహస్య సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు చెన్నై హార్బర్‌లో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో దిండుగల్‌లోని ఒక ఎగుమతుల కంపెనీకి చెందిన నౌక ఇరాన్ నుంచి వచ్చింది. నౌకలో జిప్సం, ఉప్పు దిగుమతి చేస్తున్నట్టుగా తెలిపి అట్టపెట్టెల్లో విదేశీ సిగరెట్లను అక్రమంగా తీసుకొచ్చినట్టు గుర్తించారు. మొత్తం 490 అట్టపెట్టెల్లో ఇండోనేషియాలో తయారైన ప్రముఖ కంపెనీకి చెందిన సిగరెట్లు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.
రూ.9.7 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం
Feb 4 2018 2:09 AM | Updated on Feb 4 2018 2:09 AM
Advertisement
Advertisement