శ్రుతిహాసన్ దిగొచ్చారా? | Court Restrains Shruti Hassan from Signing New Movies | Sakshi
Sakshi News home page

శ్రుతిహాసన్ దిగొచ్చారా?

Apr 1 2015 1:43 AM | Updated on Aug 17 2018 2:34 PM

శ్రుతిహాసన్ దిగొచ్చారా? - Sakshi

శ్రుతిహాసన్ దిగొచ్చారా?

నటి శ్రుతిహాసన్ దిగొచ్చారా? నటించనని వైదొలగిన చిత్రంలో తిరిగి భాగం కానున్నారా? వివాదస్పదం కావొద్దన్న

 నటి శ్రుతిహాసన్ దిగొచ్చారా? నటించనని వైదొలగిన చిత్రంలో తిరిగి భాగం కానున్నారా? వివాదస్పదం కావొద్దన్న సన్నిహితులు హితవు పని చేసిందా? అలాంటి అంశాలు కోలీవుడ్‌లో ప్రస్తుతం చర్చగా మారాయి. టాలీవుడ్ నటుడు నాగార్జున, కోలీవుడ్ నటుడు కార్తీ కలసి నటిస్తున్న భారీచిత్రాన్ని పీవీపీ సినిమా నిర్మిస్తున్న సంగతి ఆ చిత్రంలో నటించడానికి ఒప్పుకుని, చిత్ర షూటింగ్ ప్రారంభమైన తరువాత నటించనని చెప్పిన నటి శ్రుతిహాసన్ వ్యవహారం హాట్‌గా మారిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాతలు శ్రుతిహాసన్‌పై కోర్టుకు వెళ్లిన విషయం ఆమెను కొత్త చిత్రాలు అంగీకరించరాదని కోర్టు ఆదేశించిన విషయం విదితమే.
 
  కాగా ఆ చిత్రంలో శ్రుతిహాసన్ పాత్రలో నటి తమన్నను నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో కథ అనూహ్య మలుపు తిరిగినట్లు తాజా సమాచారం. నటించనని వైదొలగిన చిత్రంలో నటి శ్రుతిహాసన్ నటించడానికి సిద్ధం అయినట్లు తెలిసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలో వివాదాలకు పోయి సమస్యలను కొని తెచ్చుకోవద్దని శ్రుతిహాసన్ సన్నిహితులు మాటలు పని చేశాయని సమాచారం. దీంతో పీవీపీ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో శ్రుతి నటించే విషయమై సామరస్య పూర్వక చర్చలు జరుగుతున్నట్లు కోలీవుడ్ టాక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement