వరంగల్‌ నుంచే టీఆర్‌ఎస్‌ పతనం: ఉత్తమ్‌ | congress leadar uttamkumar reddy slams trs government | Sakshi
Sakshi News home page

వరంగల్‌ నుంచే టీఆర్‌ఎస్‌ పతనం: ఉత్తమ్‌

Jan 19 2017 4:34 PM | Updated on Sep 19 2019 8:44 PM

వరంగల్‌ నుంచే టీఆర్‌ఎస్‌ పతనం: ఉత్తమ్‌ - Sakshi

వరంగల్‌ నుంచే టీఆర్‌ఎస్‌ పతనం: ఉత్తమ్‌

వరంగల్ నుంచే టీఆర్‌ఎస్‌ పతనం ప్రాంభం అవుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.

వరంగల్ అర్బన్ : వరంగల్ నుంచే టీఆర్‌ఎస్‌ పతనం ప్రాంభం అవుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. పెద్దనోట్ల రద్దుపై యావత్‌ దేశం ఇబ్బందులు పాలు కాగా, ప్రధానమంత్రి మోదీని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ పొగడటం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో అధికార టీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీస్తోందని ఆయన అన్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో గురువారం వరంగల్‌లో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల తెలంగాణ లో 44 లక్షల  ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిందని ఉత్తమ్‌ చెప్పారు.
 
రైతులకు పంట రుణాలు ఇవ్వలేదని , స్టూడెంట్స్‌కు ఫీజు ఇవ్వలేదని చెప్పారు. రైతు కూలీలకు ఉపాధి హామీ నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఈ బహిరంగ సభకు భారీగా మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రెసిడెంట్ నేరెళ్ల శారద, ఏఐసీసీ నేత కుంతియా, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ బలరాం నాయక్ హాజరయ్యారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement