కలలో ఆత్మహత్య.. నిజం చేసిన బాలిక | Chennai college girl commits suicide | Sakshi
Sakshi News home page

కలలో ఆత్మహత్య.. నిజం చేసిన బాలిక

May 7 2017 9:56 AM | Updated on Sep 5 2017 10:38 AM

కలలో ఆత్మహత్య.. నిజం చేసిన బాలిక

కలలో ఆత్మహత్య.. నిజం చేసిన బాలిక

ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన కలను నిజం చేస్తూ ఓ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహుతి చేసుకున్న సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

కేకే నగర్‌ (చెన్నై): ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన కలను నిజం చేస్తూ ఓ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహుతి చేసుకున్న సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని తండయారుపేట వినోద్‌ పాల్‌ నగర్‌కు చెందిన వేలు ప్రైవేటు సంస్థలో వాచ్‌మెన్‌. ఇతని కుమార్తె దుర్గ(16) ఇంటర్‌ చదువుతోంది. తరచూ తాను ఉరి వేసుకుని, ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని చనిపోయినట్లు కలలు వచ్చేవని దుర్గ తల్లితో చెప్పేది.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని బాలిక ఆత్మాహుతికి పాల్పడింది. కేకలు విని అక్కడకు చేరుకున్న చుట్టుపక్కల వారు వెంటనే బాలికను కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దుర్గ శనివారం ఉదయం మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement