breaking news
tondiarpet
-
కలలో ఆత్మహత్య.. నిజం చేసిన బాలిక
కేకే నగర్ (చెన్నై): ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన కలను నిజం చేస్తూ ఓ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి చేసుకున్న సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని తండయారుపేట వినోద్ పాల్ నగర్‌కు చెందిన వేలు ప్రైవేటు సంస్థలో వాచ్మెన్. ఇతని కుమార్తె దుర్గ(16) ఇంటర్ చదువుతోంది. తరచూ తాను ఉరి వేసుకుని, ఒంటిపై కిరోసిన్ పోసుకుని చనిపోయినట్లు కలలు వచ్చేవని దుర్గ తల్లితో చెప్పేది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని బాలిక ఆత్మాహుతికి పాల్పడింది. కేకలు విని అక్కడకు చేరుకున్న చుట్టుపక్కల వారు వెంటనే బాలికను కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దుర్గ శనివారం ఉదయం మృతిచెందింది. -
పిల్లలూ భద్రం.. చాక్లెట్లలో గంజాయి
చెన్నై: మత్తుపదార్థాల మిశ్రమంతో కూడిన చాక్లెట్లు, పీచుమీటాయిలాంటివి చిన్నారులకు విక్రయిస్తున్న ఓ దుకాణాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తాండియర్ పేట్ లో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు జైలుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గతవారం ఓ పదమూడేళ్ల బాలుడు తాండియర్ పేట్ లోని ఓ దుకాణంలో స్వీట్ కొనుక్కున్నాడు. అది తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా తిన్న స్వీట్ లో మత్తుపదార్థాలు ఉన్నాయని వైద్యులు చెప్పడంతో డ్రగ్స్ నివారణ చట్టం కింద సురేశ్ మహోలా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఆ బాలుడికి విక్రయించిన చాక్లెట్స్ ప్యాకెట్లను ఆరింటిని స్వాధీనం చేసుకొని ల్యాబ్ కు పంపించారు. వీటిని పరీక్షంగా వీటిల్లో కూడా గంజాయి ఆకులతో తయారు చేసిన మిశ్రమం ఉన్నట్లు గుర్తించారు. కోల్ కతాలోని వెండోర్ అనే ప్రాంతం నుంచి తాను చాక్లెట్లు, పీచు మిఠాయిలు తీసుకొస్తానని, 40 రూపాయిలకు 40 తెస్తానని, బయట మాత్రం ఒక్కొక్కటి 15 రూపాయలకు అమ్ముతానని చెప్పాడు. ఇతడిది బిహార్.