చెన్నైలో భవనం కూలిన ఘటనలో 24కు చేరిన మృతులు | Chennai Building Collapse: 24 Dead, Around 26 Still Feared Trapped | Sakshi
Sakshi News home page

చెన్నైలో భవనం కూలిన ఘటనలో 24కు చేరిన మృతులు

Jul 1 2014 8:20 AM | Updated on Sep 2 2017 9:39 AM

చెన్నై మహానగరంలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. భవన శిథిలాల కింద మంగళవారం మరో మృతదేహన్ని కనుగొన్నారు.

చెన్నై మహానగరంలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. భవన శిథిలాల కింద మంగళవారం మరో మృతదేహన్ని కనుగొన్నారు. మృతుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన మహేశ్గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. శిథిలాల కింద 26 మంది చిక్కుకున్నారని భావిస్తున్నట్లు చెప్పారు. వారిని రక్షించేందుకు  సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. భారీ వర్షాల కారణంగా శనివారం 11 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 26 మంది ఆచూకీ తెలియకుండా పోయారు.

Advertisement
 
Advertisement
Advertisement