లోయలోపడిన కారు : ఐదుగురి మృతి | Car falls in gorge, five die in kanchipuram | Sakshi
Sakshi News home page

లోయలోపడిన కారు : ఐదుగురి మృతి

Nov 1 2015 10:10 AM | Updated on Apr 4 2019 5:24 PM

తమిళనాడులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

చెన్నై : తమిళనాడులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంచీపురం జిల్లా కల్పాకం సమీపంలో కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అనంతరం  కారులోని మృతదేహలను బయటకు తీశారు. మృతదేహలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement