చెన్నై తిరువొత్తియూరు 10వ వార్డులో శనివారం నుంచి ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు తిరువొత్తియూరులోని వి.రామకృష్ణ పాఠశాలలో
ఆధార్ కార్డుల ప్రక్రియ ప్రారంభం
Published Sun, Dec 1 2013 2:07 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : చెన్నై తిరువొత్తియూరు 10వ వార్డులో శనివారం నుంచి ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు తిరువొత్తియూరులోని వి.రామకృష్ణ పాఠశాలలో కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ ఆదివారం వెస్టుమాడ వీధికి చెందిన వారికి, సోమవారం వివేకానంద నగర్‌కు చెం దిన ప్రజలకు, 3వ తేదీన రైల్వేస్టేషన్ రోడ్డుకు చెందిన వారికి, 4, 5వ తేదీల్లో నార్త్ రైల్వేస్టేషన్ రోడ్డుకు చెందిన వారికి ఫొటోలు తీస్తామని అధికారులు తెలిపారు. 6న పెరియార్ నగర్ ప్రజలకు, 7వ తేదీన నందివోడైకు చెందిన వారికి ఆధార్ ఫొటోలు తీస్తామన్నారు. 10వ వార్డుకు చెందిన ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఆధార్ గుర్తింపు కార్డులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ సూర్యబాబు, అన్నాడీఎంకే కార్యకర్తలు కేఆర్ దేవరాజ్, కె.ఢిల్లీబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement