సంస్కృతిని ఆవిష్కరించేలా కుట్రపరంపరై | Sakshi
Sakshi News home page

సంస్కృతిని ఆవిష్కరించేలా కుట్రపరంపరై

Published Fri, Jan 8 2016 2:36 AM

సంస్కృతిని ఆవిష్కరించేలా కుట్రపరంపరై

దర్శకుడు బాలా తన చిత్రాలకు తీసుకునే ఇతి వృత్తమే ఇతర చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సేతు, పితామగన్, నందా, నాన్‌కడవుల్, పరదేశి లాంటి చిత్రాలే ఇందుకు సాక్ష్యం. కథలో బలమైన పాయింట్ లేనిదే ఆయన టచ్ చేయరు. ప్రస్తుతం తమిళుల సంస్కృతిలో ఒక భాగం అయిన గరగాటక్కారన్ కళ ఇతి వృత్తాన్ని తీసుకుని తారైతప్పట్టై చిత్రాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. శశికుమార్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న ఆ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ నాయకిగా నటించారు.
 
 ఇళయరాజా సంగీతాన్ని అందించిన 1000వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా తెరపైకి రానుంది. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత బాలా తదుపరి మరో సంచలన కథను చిత్రంగా మలచడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో విశాల్, అరవింద్‌సామి, ఆర్య, అధర్వ, రానా మొదలగు ఐదుగురు కథానాయకులు నటించనున్నట్టు ఇప్పటికే ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. నాయకిగా అందాల తార అనుష్క నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా హిందీ నటుడు ఇబ్రాన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రను పోషించనుండడం విశేషం. అయితే ఈ చిత్రానికి కథ ఏమిటన్న తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
  ప్రముఖ ర చయిత, నటుడు వేల్ రామమూర్తి రాసిన కుట్రపరంపరై అనే నవలను వెండితెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇది బ్రిటీష్ ఇండియాలో తీసుకొచ్చిన ఒక చట్టం.ఆ కుట్రపరంపరై చట్టం వల్ల ఒక సంఘం ఎలాంటి బాధల్ని ఎదుర్కొంది అన్నదే కథ. అప్పటి సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరించే చి త్రంగా కుట్రపరంపరై ఉంటుందని తెలి సింది. సంక్రాంతి పండగ తరువాత ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వె ల్లడించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ సమాచారం.
 

Advertisement
Advertisement