అనుష్కశర్మకు ఆసిన్ వకాల్తా | Asin supports Anushka Sharma | Sakshi
Sakshi News home page

అనుష్కశర్మకు ఆసిన్ వకాల్తా

Mar 29 2015 12:59 AM | Updated on Sep 2 2017 11:31 PM

అనుష్కశర్మకు ఆసిన్ వకాల్తా

అనుష్కశర్మకు ఆసిన్ వకాల్తా

నటి అనుష్క శర్మకు ఆసిన్ వకల్తా పుచ్చుకున్నారు. సినిమా నటిగా ప్రాచుర్యం కంటే అధికంగా ఇప్పుడు

నటి అనుష్క శర్మకు ఆసిన్ వకల్తా పుచ్చుకున్నారు. సినిమా నటిగా ప్రాచుర్యం కంటే అధికంగా ఇప్పుడు వేరే విధంగా జనాల నోళ్లలో నానిపోతున్నారు నటి అనుష్కాశర్మ. ఆమెకు క్రికెట్ కళాకారుడు విరాట్‌కోహ్లికి మధ్య ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే వీరి సంబంధం గురించి ఇప్పుడు నిక్కర్లు తొడుక్కునే కుర్రాళ్ల వరకు తెలిసిపోయింది. ఇక సోషల్‌నెట్ వర్క్సులో అయితే ఈ సంచలన జంట గురించి రకరకాలుగా ఏకేస్తున్నారు. కారణం చెప్పనక్కరలేదు.
 
  ఇటీవల జరిగిన ప్రపంచకప్ క్రికెట్ క్రీడలో విరాట్‌కోహ్లి ఆట తీరు అది తిలకించడానికి సిడ్నీ వెళ్లిన నటి అనుష్క శర్మ ప్రవర్తన ఇండియా సెమీఫైనల్‌లో ఓడిపోవడానికి కారణం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. విరాట్‌కోహ్లి ఒకే ఒక్క రన్‌తో పెవిలియన్‌కు దారి తీయడం క్రికెట్ క్రీడా ప్రియులు జీర్ణం చేసుకోవడం లేదు. కోహ్లి, అనుష్కశర్మపై పెట్టిన ఏకాగ్రత క్రికెట్‌పై పెట్టలేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నటి అనుష్క శర్మకు నటి ఆసిన్ వకాల్తా పలకడం విశేషం.
 
 ఆమె ఈ వ్యవహారం గురించి తన ట్విట్టర్‌లో పేర్కొంటూ అనుష్కశర్మను తప్పుపట్టడం మూర్ఖులు చేసే పని అన్నారు. భారత క్రికెట్ జట్టుకు మద్దతు ఇవ్వడానికి వెళ్లటం ఆమె చేసిన తప్పా అంటూ ప్రశ్నించారు. పని లేని కొందరు తన అమాయకత్వాన్ని వేరే విధంగా చూపుతున్నారని దుయ్యబట్టారు. ఇంతకుముందు ఆసిన్, భారత క్రికెట్ కెప్టెన్ ధోని మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగింది. అది నిజం చేస్తూ ఆసిన్ అనుష్కశర్మకు వకాల్తా పలికే ధోరణిలో ధోనిని వెనకేసుకొస్తున్నట్లు టాక్ స్ప్రెడ్ అవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement