కేజ్రీవాల్కు యూపీలో జడ్ కేటగిరీ, ఢిల్లీలో రహస్య భద్రత | Arvind Kejriwal gets Z category security in Uttar Pradesh, 'discreet' cover in Delhi | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్కు యూపీలో జడ్ కేటగిరీ, ఢిల్లీలో రహస్య భద్రత

Jan 13 2014 1:31 PM | Updated on May 28 2018 1:46 PM

కేజ్రీవాల్కు యూపీలో జడ్ కేటగిరీ, ఢిల్లీలో రహస్య భద్రత - Sakshi

కేజ్రీవాల్కు యూపీలో జడ్ కేటగిరీ, ఢిల్లీలో రహస్య భద్రత

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఇష్టం ఉన్నా.. లేకపోయినా ఆయనకు మాత్రం జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో గల కౌశాంబి ప్రాంతంలోని ఆయన ఇంటివద్ద మొత్తం 30 మంది భద్రతా సిబ్బంది అనుక్షణం పహరా కాస్తుంటారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఇష్టం ఉన్నా.. లేకపోయినా ఆయనకు మాత్రం జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో గల కౌశాంబి ప్రాంతంలోని ఆయన ఇంటివద్ద మొత్తం 30 మంది భద్రతా సిబ్బంది అనుక్షణం పహరా కాస్తుంటారు. అయితే ఢిల్లీలో మాత్రం రహస్య భద్రత మాత్రమే కల్పిస్తున్నారు. శనివారం నాడు ఢిల్లీ సచివాలయం వెలుపల నిర్వహించిన 'జనతా దర్బార్'లో అత్యధిక స్థాయిలో జనం రావడం, వారిని నియంత్రించడం కూడా సాధ్యం కాకపోవడం లాంటి సంఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కేజ్రీవాల్కు తెలియకుండానే ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఇంతకుముందే ప్రకటించారు. సామాన్య ప్రజల రూపంలో ఆయనకు ముప్పు కలిగించే శక్తులు వచ్చే ప్రమాదం ఉన్నందున భద్రత తప్పనిసరిగా కల్పిచాల్సిందేనని ఆయన అన్నారు. అయితే ఘజియాబాద్ పోలీసులు ఎన్నిసార్లు కోరినా కేజ్రీవాల్ మాత్రం తనకు భద్రత అవసరం లేదని కుండబద్దలుకొట్టి చెబుతున్నారు.  గత వారం కూడా ఆయన ఇంటికి కిలోమీటరు దూరంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై కొందరు దుండగులు దాడిచేసి తగలబెట్టినా.. దాన్నీ తేలిగ్గానే తీసుకున్నారు. దాంతో ఇక ఆయనకు 24 గంటలూ జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించినట్లు ఘజియాబాద్ పోలీసు అధికారి ధర్మేంద్రసింగ్ తెలిపారు. ఆయన ఇంటి బయట ఎప్పుడూ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వారితో పాటు ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు కూడా ఉంటారు. కేజ్రీవాల్ ఎప్పుడు బయటకెళ్లినా ఆయనతో పాటు సాయుధులతో కూడిన రెండు కార్లు వెంట ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement