పోలీసు రాజ్యం నడుస్తోంది: అంబటి | ambati rambabu comments at narasaraopet meeting | Sakshi
Sakshi News home page

పోలీసు రాజ్యం నడుస్తోంది: అంబటి

Dec 16 2016 6:54 PM | Updated on May 29 2018 4:26 PM

పోలీసు రాజ్యం నడుస్తోంది: అంబటి - Sakshi

పోలీసు రాజ్యం నడుస్తోంది: అంబటి

ఏపీలో ప్రజాస్వామ్యం కాకుండా పోలీసు రాజ్యం నడుస్తుందని అంబటి విమర్శించారు.

నరసరావుపేట: పౌరుషాలకు నెలవైన పల్నాడు గడ్డపై దారుణమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం నరసరావుపేటలోని రెడ్డి కాలేజీ గ్రౌండ్స్‌లో వైఎస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. భారతదేశాన్ని ప్రభావితం చేసిన కుటుంబం నుంచి.. కాసు మహేష్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌ సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పల్నాడులో కోడెల శివప్రసాద్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని అంబటి ఆరోపించారు. నడికుడి నుంచి కాళహాస్తి వరకు రైల్వే పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ డబ్బులివ్వలేదని దాడికి పాల్పడ్డారని.. కోడెలపై అంబటి ధ్వజమెత్తారు.

పల్నాడుతో సహా ఏపీలో ప్రజాస్వామ్యం కాకుండా పోలీసు రాజ్యం నడుస్తుందని అంబటి విమర్శించారు. పల్నాడు గడ్డపై జరుగుతున్న సభను చూసి టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతాయన్న ఆయన కర్రుకాల్చి వాతపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement