తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విషాదం | 9 drown in telangana four districts | Sakshi
Sakshi News home page

తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విషాదం

Oct 16 2016 7:18 PM | Updated on Sep 4 2017 5:25 PM

తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విషాదం

తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విషాదం

తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విషాదం నెలకొంది. ఈత సరదా తొమ్మిది మంది ప్రాణాలు తీసింది.

హైదరాబాద్: తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విషాదం నెలకొంది. ఈత సరదా తొమ్మిది మంది ప్రాణాలు తీసింది. మహబూబ్ నగర్ జిల్లా అన్వాడ మండలం కొత్తపేటలో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. మృతులు సాయికుమార్(10) శివ(10), శివకుమార్(8)గా గుర్తించారు.

ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం పంగిడిలో చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దేవేందర్ నగర్ లో క్వారీ గుంతలో ఈతకు దిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం న్యామత్ ఉర్సులో విషాదం చోటు చేసుకుంది. బావిలోకి ఈతకు దిగి మీర్ షారుఖ్‌ అలీ మృతి చెందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement