ప్రతి గ్రామానికి రూ. కోటి

ప్రతి గ్రామానికి రూ. కోటి


గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయం

ఎమ్మెల్యే ఇక్బాల్ అన్సారీ




గంగావతి : ప్రతి గ్రామాన్ని కోటి రూపాయల నిధులతో సమగ్ర అభివృద్ధి చేపడతామని ఎమ్మెల్యే ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు. ఆయన గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన సాణాపుర గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. గంగావతి అసెంబ్లీ క్షేత్ర స్థాయిలో 160 గ్రామాలున్నాయని, ఒక్కొక్క గ్రామానికి కోటి రూపాయల నిధులను కల్పించి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తాలూకాలోని సాణాపుర గ్రామ పం చాయతీని నూతనంగా ఏర్పాటు చేశారని, పం చాయతీకి అవసర మైన కంప్యూటర్లు, ఇతర సౌక ర్యాల కోసం రూ.5 లక్షల నిధులను అం దిస్తున్నానన్నారు.



మరో దఫా రూ.20 లక్షల నిధులను నూతన పంచాయతీకి    అందిస్తామన్నారు. ఈ ప్రాంత గ్రామ ప్రజలు ప్రయాణ సౌకర్యార్థం, 10 సిటీ బస్సులను సాణాపురంకు ఏర్పాటు చేశామన్నారు.  గ్రామ పంచాయతీలకు పేద ప్రజలకు అందించే ఇళ్లను గ్రామ సభలు జరిపి పారదర్శకంగా పంపిణీ అయ్యేలా పీడీఓలు శ్రద్ధ వహించాలని సూచించారు. నూతన గ్రా మ పంచాయతీ అభివృద్ధికి సభ్యులు, అ ద్యక్ష, ఉపాధ్యక్షులు కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సభ్యులు టీ.జనార్థన్, గ్రామ పంచాయితీ అధ్యక్షులు యశోధ నరసింహులు, సభ్యులు ఎం.వెంకటేష్, తాలూకా పంచాచతీ అధ్యక్షురాలు ఈర మ్మ ముదియప్ప, ఎస్‌ఎన్.మఠద్, తా లూకా పంచాయతీ సభ్యురాలు రాజేశ్వరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మల్లికార్జునను ఘనంగా సన్మానించి సత్కరించారు.

 

 

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top