breaking news
Iqbal Ansari
-
‘స్వామికి అంత తొందరెందుకు?’
న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదంలో కేసు విచారణను వేగవంతం చేసేలా బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తొందరపెడుతున్నారని ఇక్బాల్ అన్సారీ అనే కక్షిదారు ఆరోపించారు. కేసు విచారణకు సంబంధించిన కక్షిదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని మహ్మద్ హసీమ్ అన్సారీ కుమారుడు ఇక్బాల్ అన్సారీ.. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. తమ తరపు న్యాయవాదికి సమాచారం ఇవ్వకుండానే సీజేఐ ముందు స్వామి వివాదానికి సంబంధించిన విచారణను లేవనెత్తారన్నారు. మొదటిసారిగా ఫైజాబాద్ కోర్టులో రామజన్మభూమిపై కేసు వేసిన అన్సారీ (95) గతేడాది ఆగస్టులో కన్నుమూశారు. కాగా, రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదం కేసును అత్యవసరంగా విచారించాలన్న స్వామి అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. -
ప్రతి గ్రామానికి రూ. కోటి
గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయం ఎమ్మెల్యే ఇక్బాల్ అన్సారీ గంగావతి : ప్రతి గ్రామాన్ని కోటి రూపాయల నిధులతో సమగ్ర అభివృద్ధి చేపడతామని ఎమ్మెల్యే ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు. ఆయన గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన సాణాపుర గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. గంగావతి అసెంబ్లీ క్షేత్ర స్థాయిలో 160 గ్రామాలున్నాయని, ఒక్కొక్క గ్రామానికి కోటి రూపాయల నిధులను కల్పించి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తాలూకాలోని సాణాపుర గ్రామ పం చాయతీని నూతనంగా ఏర్పాటు చేశారని, పం చాయతీకి అవసర మైన కంప్యూటర్లు, ఇతర సౌక ర్యాల కోసం రూ.5 లక్షల నిధులను అం దిస్తున్నానన్నారు. మరో దఫా రూ.20 లక్షల నిధులను నూతన పంచాయతీకి అందిస్తామన్నారు. ఈ ప్రాంత గ్రామ ప్రజలు ప్రయాణ సౌకర్యార్థం, 10 సిటీ బస్సులను సాణాపురంకు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ పంచాయతీలకు పేద ప్రజలకు అందించే ఇళ్లను గ్రామ సభలు జరిపి పారదర్శకంగా పంపిణీ అయ్యేలా పీడీఓలు శ్రద్ధ వహించాలని సూచించారు. నూతన గ్రా మ పంచాయతీ అభివృద్ధికి సభ్యులు, అ ద్యక్ష, ఉపాధ్యక్షులు కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సభ్యులు టీ.జనార్థన్, గ్రామ పంచాయితీ అధ్యక్షులు యశోధ నరసింహులు, సభ్యులు ఎం.వెంకటేష్, తాలూకా పంచాచతీ అధ్యక్షురాలు ఈర మ్మ ముదియప్ప, ఎస్ఎన్.మఠద్, తా లూకా పంచాయతీ సభ్యురాలు రాజేశ్వరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మల్లికార్జునను ఘనంగా సన్మానించి సత్కరించారు.