
శ్రీకాకుళం , సీతంపేట: ప్రపంచబ్యాంకు బృందం సీతంపేటలో ఏజెన్సీలో సోమవారం పర్యటించనునందని ఐటీడీఏ పీవో లోతేటి శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు బృందాలుగా విడిపోయి మండలంలోని వెంకటిగూడ, చిన్నబగ్గ, చొర్లంగి గ్రామాలను సందర్శించి అక్కడ మహిళా సంఘాలతో సమావేశమవుతాయని పేర్కొన్నారు. దీంతోపాటు స్థానిక వెలుగు ఎంఎంఎస్‌లో ఓబీ సభ్యులతో సమావేశం ఉంటుందని తెలిపారు.