గ్రామంపై విరుచుకుపడ్డ ఏనుగులు: రైతు మృతి | Crops Destroyed, Farmer Killed in Elephant Attack in Srikakulam district | Sakshi
Sakshi News home page

గ్రామంపై విరుచుకుపడ్డ ఏనుగులు: రైతు మృతి

Jul 9 2014 11:38 AM | Updated on Oct 1 2018 4:01 PM

శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని బుధవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాడలి గ్రామంపై ఏనుగులు ఒక్కసారిగా ముకుమ్మడిగా దాడి చేశాయి.

శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని బుధవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాడలి గ్రామంపై ఏనుగులు ఒక్కసారిగా ముకుమ్మడిగా దాడి చేశాయి. ఆ దాడిలో మురళి అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల దాడితో గ్రామస్తులు ఇళ్లు వదిలి భయంతో పరుగులు తీశారు.

 

దాంతో ఏనుగులు గ్రామమంతా కలియ దిరుగుతూ హల్చల్ సృష్టించాయి. పాడలి పరిసర ప్రాంతాలలోని పంటపోలాలన్ని పూర్తిగా నాశనమైనాయి.  గ్రామస్తులు గ్రామంలోకి వచ్చేందుకు తీవ్రంగా భయపడుతున్నారు. ఏనుగులు గ్రామంలోకి దూసుకువచ్చి దాడి చేయడంతో గ్రామస్తులు సమీపంలోని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement