breaking news
world bank team tour
-
ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన నేడు
శ్రీకాకుళం , సీతంపేట: ప్రపంచబ్యాంకు బృందం సీతంపేటలో ఏజెన్సీలో సోమవారం పర్యటించనునందని ఐటీడీఏ పీవో లోతేటి శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు బృందాలుగా విడిపోయి మండలంలోని వెంకటిగూడ, చిన్నబగ్గ, చొర్లంగి గ్రామాలను సందర్శించి అక్కడ మహిళా సంఘాలతో సమావేశమవుతాయని పేర్కొన్నారు. దీంతోపాటు స్థానిక వెలుగు ఎంఎంఎస్లో ఓబీ సభ్యులతో సమావేశం ఉంటుందని తెలిపారు. -
రేపటి నుంచి ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన
విజయవాడ : జిల్లాలో అమలు చేస్తున్న ఆధార్ ఆధారిత చెల్లింపు విధానంపై సమగ్ర పరిశీలన కోసం ప్రపంచ బ్యాంక్ బృందం ఈ నెల 16, 17 తేదీల్లో పర్యటించనున్నట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ప్రపంచ బ్యాంకు బృందం పర్యటనను పురస్కరించుకుని బుధవారం కలెక్టర్ తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కృష్ణా జిల్లా నేషనల్ పేమెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా చెల్లింపుల విధానంలో ప్రత్యేక గుర్తింపు పొందినట్లు చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చే ప్రపంచ బ్యాంకు బృందంలో 17 మంది సభ్యులు ఉంటరని తెలిపారు. ఈ బృందం 15వ తేదీ సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుందని, 16వ తేదీ ప్రజా పంపిణీ వ్యవస్థ, పింఛన్ల పంపిణీ, ఎన్ఆర్ఈజీఎస్ వేతనాల పంపిణీ తదితర అంశాలను, 17న జిల్లాలో నూతనంగా ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్స్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలిస్తారని వివరించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు, డీఎస్వో రవికిరణ్, డ్వామా పీడీ మాధవీలత, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.