రిమ్స్‌పై సవతి ప్రేమ!

tdp government neglected on rims medical college - Sakshi

అదనంగా 50 సీట్లు మంజూరు

అందుకు తగ్గట్టుగా కానరాని సౌకర్యాలు

ఫలితంగా సీట్లు వస్తాయో.. లేదో అనే అనుమానం

నిధులు విదల్చని సర్కార్‌

ఎంసీఐ బృందం వచ్చేనాటికైనా సౌకర్యాలు సాధ్యమేనా?

పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా తయారైంది శ్రీకాకుళంలోని రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) పరిస్థితి. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలతోపాటు అందులోనే సర్వజనీన ఆస్పత్రి
నడుస్తోంది. అయితే దీన్ని అభివృద్ధి చేసే వారే కరువయ్యారు. ప్రస్తుత పాలకులు సవతి ప్రేమ చూపిస్తుండడంతో అభివృద్ధి ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించడం లేదు. మెడికల్‌ కళాశాలకు అదనంగా 50 పీజీ సీట్లు మంజూరైనప్పటికీ.. అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడంతో ఈ సీట్లు ఉంటాయో.. పోతాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంసీఐ బృందం పరిశీలనకు రానుంది.
ఆ సమయానికైనా సౌకర్యాలు చేకూరుతాయో లేదో తెలియడం పరిస్థితి. అభివృద్ధికి ముందుంటామని పలుమార్లు రిమ్స్‌ను సందర్శించిన అమాత్యుల హామీలు అమలు కాకపోవడం శాపంగా మారింది.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రిమ్స్‌ మెడికల్‌ కళాశాలను దివంగత ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంజూరు చేశారు. ఆయన అధికారంలో ఉండగానే పనులు చకచకా జరి గాయి. కళాశాలలో ఎంబీబీఎస్‌ తరగతులు కూడా ప్రారంభించారు. అయితే ఆయన మరణం తరువాత పాలనా పగ్గాలు చేపట్టిన వారు కళాశాలను, ఆస్పత్రిని నిర్లక్ష్యం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం  పట్టించుకోకపోవడంతో కనీస వసతులు కానరావడం లేదు. మంజూరైన పనులు నత్తనడకన సాగుతున్నా యి. ఫలితంగా రిమ్స్‌ అంటే ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందనే భావ న ప్రజల్లో నెలకొంది. దీనికంటే వెనుక వచ్చిన ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలో పీజీ సీట్లు, ఆదనపు ఎం బీబీఎస్‌ సీట్లు పెరిగాయి. రిమ్స్‌కి మాత్రం అతీగతీ లేదు. గడచిన నాలుగేళ్లలో జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర వైద్య ఆరో గ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ లు పలుమార్లు రిమ్స్‌ని సందర్శిం చారు. అన్ని వసతులు కల్పిస్తామని, పీజీ సీట్లు మం జూరు చేసి, సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించేందుకు వీలుగా వైద్యులను నియమిస్తామని ఇచ్చిన హమీలు కార్యరూపం దాల్చలేదు. 

అదనపు సీట్లకు తగ్గట్టుగా కానరాని సౌకర్యాలు
రిమ్స్‌ మెడికల్‌ కళాశాల ఇప్పటికే వంద ఎంబీబీఎస్‌ సీట్లతో నడుస్తోంది. మరో 50 సీట్లు ప్రభుత్వం మం జూరు చేసింది. రిమ్స్‌లో సూపర్‌ స్పెషాలిటీ వసతులు పెరగాలంటే వివిధ విభాగాల్లో పీజీ సీట్లు రావాల్సింది. ప్రస్తుతం ఒక్క విభాగంలోనే పీజీ సీట్లు ఉన్నా యి. పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యం, స్పెషాలిటీ వై ద్యులు, ప్రొఫెసర్లు ఉండాలంటే కనీసం 12 విభాగా ల్లో పీజీ సీట్లు మంజూరు కావాల్సి ఉంది. అయితే అందుకు తగిన వసతులు, విభాగాల వారీగా ప్రొఫె సర్లు రిమ్స్‌లో లేరు. అదనపు సీట్ల మంజూరుకి కావా ల్సిన వసతులు కల్పించాచడంతోపాటు అదనంగా మంజూరైన సీట్లకి తగ్గట్టుగా వసుతులు పెంచాల్సి ఉంది.

నత్తనడకన పనులు!
రిమ్స్‌లో వసతుల కొరత ప్రస్తుతం వేధిస్తోంది. అదనపు సీట్లు వస్తే ఆ విద్యార్థులు ఎక్కడ ఉండాలో తెలి యని పరిస్థితి. రిమ్స్‌ మెడికల్‌ కళాశాలకు 13 బ్లాకులు మంజూరయ్యాయి. గడిచిన పదేళ్లుగా కేవలం 9 బ్లాకులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన నాలుగు నిర్మాణం దశలోనే ఉన్నాయి. ఇటీవల మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ బాబ్జీ వీటిని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనికి ఇంజినీరింగ్‌ అధికారులు  ఈ నెలలో అప్పగిస్తామని హామీ ఇచ్చినా.. పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.

నిధులు విదల్చని చంద్రబాబు సర్కార్‌
అదనంగా పెంచిన 50 సీట్లలో చేరే విద్యార్థులకు కావాల్సిన వసతుల కోసం ప్రభుత్వం 60 కోట్ల రూపాయలను కేటాయించింది. వీటిలో 60 శాతం, 40 శాతం వంతున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చాలి. ఇందులో తొలి విడతలో కేంద్ర ప్రభుత్వం వాటాలోని 36 కోట్ల రూపాయలకు రూ. 9 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 24 కోట్లు మంజూరు  చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ రూపాయి కూడా విదల్చలేదు. ఈ నిధులు వస్తేగాని అదనపు వసతుల కల్పన సాధ్యంకాదు. ఈ నిధులతోనే అదనపు సీట్లలో చేరే 50 మంది విద్యార్థులకు ప్రసుతం ఉన్న మహిళా వసతి గృహం బ్లాకుపై మూడో ఫ్లోర్‌ వేయాల్సి ఉంటుంది.  ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోడంతో ఈ పనులకు సంబంధించి ఎలాంటి చర్యలు ముందుకు సాగలేదు. ఈ పరిస్థతుల్లో 50 అదనపు సీట్లు ఈ ఏడాది వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. అన్ని వసతులు పూర్తయితే 2019లో ప్రవేశాలు జరగవచ్చు.

పీజీ సీట్లు వచ్చేనా?
రిమ్స్‌ మెడికల్‌ కళాశాలకు పీజీ సీట్లు అందని ద్రాక్షగా మారాయి. పీజీ సీట్ల కోసం రెండేళ్ల క్రితం ఆరు విభాగాలకు అధికారులు ప్రభుత్వానికి ధరావత్తు చెల్లించారు. అయితే ఒక్క ఫిజియాలజీ సీటు మాత్రమే వచ్చింది. మిగిలిన సీట్లు రాలేదు. దీనికి చెల్లించిన ధరావత్తును రిమ్స్‌ అధికారులు నష్టపోయారు. దీనితో పాటు పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసిన ప్రైవేటు మెడికల్‌ కళాశాలకు ముడు విభాగాల్లో సీట్లు మంజూరు కావడం గమనార్హం. ఈ ఏడాది రిమ్స్‌కు పీజీ సీట్లు కావాలంటే అధికారులు ఏప్రిల్‌లో దరఖాస్తు చేయాల్సి ఉండడంతో అధికారులు అందుకుతగ్గట్టుగా సన్నాహాలు చేస్తున్నారు.

ఏప్రిల్‌లో ఎంసీఐ బృందం రాక!
భారత వైద్యవిధాన మండలి (ఎంసీఐ) బృందం త్వరలో రిమ్స్‌ పరిశీలనకు రానుంది. ఏప్రిల్‌ నెలలో రానున్నట్టు అధికారులకు సమాచారం ఉంది. బృందం వచ్చే సమయానికి వసతులు, బోధన, బోధనేతర సిబ్బందిని సిద్ధం చేయాలి. అలాగే ఎంబీబీఎస్‌లో అదనంగా 50 సీట్లు పెంపునకు తగ్గట్టుగా వసతులు కల్పించాలి. దీనికి సంబంధించిన పూర్తి నివేదికలు సమర్పించకపోతే అదనంగా వచ్చే సీట్లకు ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రధానంగా విద్యార్థులు ఉండేందుకు కావాల్సిన బ్లాకుల నిర్మాణం చేయాలి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. అందుకు కావాల్సిన నిధులు మంజూరు చేయాలి.

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top